ఢిల్లీ టూర్ ముగించుకొని వచ్చిన పవన్ లో పొలిటికల్ స్పీడ్ పెరిగింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇసుక సమస్య ఏపీలో సమస్యల పై హస్తిన పెద్దలతో మాట్లాడేందుకు వెళ్లిన ఆయన ఢిల్లీలో అడుగు పెట్టిన క్షణం నుంచి ఆయన పర్యటన చాలా సీక్రెట్ గా సాగింది. హస్తినలో ఎవరిని కలిశారు, ఎందుకు కలిశారు, వారి మధ్య ఎలాంటి అంశాలు చర్చకొచ్చాయి అనేది ఇప్పటికీ గుట్టుగానే ఉంది. ప్రతి రోజూ జనం లో తిరుగుతూ అన్ని ప్రాంతాల వారిని కలుస్తూ అధికార పార్టీ పై విమర్శలతో విరుచుకు పడుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ త్వరలోనే తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తాడని అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వైసీపీ నేతల నుంచి వస్తున్న వాదన. మొన్న అనంతపురంలో రెడ్డి నేతల పై జనసేన కార్యకర్తలు చేసిన కామెంట్ పెద్ద దుమారమే రేపింది. వైసీపీకి కులం ఉందేమో కానీ తమకు లేదన్నారు. అంతేకాదు 3 రోజులలోగా రైతుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు పవన్ కల్యాణ్. ఈ నెల 12 లోగా అన్నదాతలకు గిట్టుబాటు ధర పై భరోసా ఇవ్వకపోతే కాకినాడ లోనే నిరాహార దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు. ఇలా ప్రతి పర్యటనలో అధికార పార్టీని విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు జనసేనా. పవన్ దూకుడు పై పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చ నడుస్తోంది.
previous article
దేశంని వణికిస్తున్న ఉష్ణోగ్రతలు…
next article
కిలో ఉల్లి కోసం లొల్లి..!