ఆయన కుటుంబ సభ్యులకు మానసిక స్థయిర్యాన్ని ఇవ్వాలి-పవన్

కోడెల చావుకు అసలు కారణాలు..?
జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ మరణంపై తన పార్టీ తరుపున సంతాపం తెలియజేసారు. రాజకీయపరమైన ఒడిదుడుకులు తట్టుకోలేక కోడెల తుదిశ్వాస విడవడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఓ ప్రకటనలో తెలియజేసారు. తనపై వచ్చిన ఆరోపణలు, విమర్శలను రాజకీయంగానే ఎదుర్కొని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కోడెల రాజకీయనాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్ గా ఎన్నో పదవులు చేపట్టారని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు మానసిక స్థయిర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

Tags:jenasenakodela shiva prsad death photoskodela shivaprsadtdp

Leave a Response