14 కిలోల బరువు తగ్గినా అల్లు అర్జున్..!

‘అల… వైకుంఠపురములో’ కోసం అల్లు అర్జున్ నాలుగు నెలల్లో 14 కిలోల బరువు తగ్గాడు. ఎలాగో తెలుసా? కిటో డైట్ ఫాలో కావడం ద్వారా. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమా కోసం బరువు తగ్గాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నప్పుడు కిటో డైట్ ఫాలో కావడం స్టార్ట్ చేశాడట. లో కార్బోహైడ్రేట్ డైట్ అన్నమాట. అదీ సంగతి. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమాలో ‘రాములో రాములా’ సాంగ్ టీజర్ ను సోమవారం సాయంత్రం విడుదల చేయనున్నారు.షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఆల్మోస్ట్ ఏడాది పాటు బన్నీ షూటింగులేవీ చేయలేదు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ విడుదల తర్వాత కథలు ఎంపికపై దృష్టి పెట్టడంతో కాస్త ఒళ్ళు చేశాడు. డిజైనర్ వేర్ స్టయిలిష్ లూజ్ టీషర్టులు వేయడంతో కొంతవరకూ మేనేజ్ చేశాడు. సినిమాలో మేనేజ్ చేయడం కష్టం. అందులోనూ మిస్టర్ పర్ఫెక్ట్ అల్లు అర్జున్ మేనేజ్ చేయడానికి ఇష్టపడడు. అందుకని బరువు తగ్గాడు. కొంత గ్యాప్ తరవాత ‘అల… వైకుంఠపురములో’ స్టిల్స్ లో బన్నీని చూసినవాళ్లు సర్‌ప్రైజ్‌ అయ్యారు. ఇంతలో అంతలా ఎలా సన్నబడ్డాడు అని.

Tags:

Leave a Response