తనయుణ్ణి హీరోగా పరిచయం చేస్తున్న సురేష్ బాబు.

రానా తమ్ముడు అభిరామ్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడని టాక్. నిజానికి, ఎప్పుడో ఈ కుర్రాడు హీరోగా రావాల్సింది. వంశీ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన ‘లేడీస్ టైలర్’ను అభిరామ్ తో చేయాలని నిర్మాత మధుర శ్రీధర్ కొంత ప్రయత్నం చేశారు. అయితే అటువంటిది ఏదీ జరగలేదు. ఎందుకో సక్సెస్ కాలేదు. తర్వాత పవన్ సాధినేని దర్శకత్వంలో అభిరామ్ హీరోగా పరిచయం కానున్నారని ఓ వార్త వినిపించింది. తర్వాత శ్రీరెడ్డి ఇష్యూలో అభిరామ్ పేరు ప్రముఖంగా వినిపించడంతో కొన్నాళ్ళు మీడియా ముందు ఎక్కడా అతడు కనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు అభిరామ్ పేరు బయటకొచ్చింది. అతడు ముంబైలో నటనలో శిక్షణ తీసుకుంటున్నాడట. మంచి కథ దొరికిన వెంటనే సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ లో తనయుణ్ణి హీరోగా పరిచయం చేస్తూ సినిమా స్టార్ట్ చేయాలని సురేష్ బాబు ప్రయత్నిస్తునాడు.

Leave a Response