ప్రభాస్ గురించి ఎవరికి తెలియని నిజాలు..!

ఫ్యాన్స్‌కు అక్టోబర్ 23 ఒక పండగ రోజు. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల హృదయాల్ని గెలుచుకున్నాడు. కొన్నేళ్లుగా ప్రభాస్ ప్రొఫెషనల్ లైఫ్ ఎంతగా లైంలైట్‌లో ఉంటూ ఉందో, అతని పర్సనల్ లైఫ్ కూడా తరచూ వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది.చాలా కాలం నుంచే “మీ పెళ్లెప్పుడు?” అని ప్రశ్నను తరచూ ఎదుర్కొంటూ వస్తున్నాడు ప్రభాస్. సహనటి అనుష్కతో అతను ప్రేమాయణం నడుపుతున్నాడంటూ పదే పదే ప్రచారంలోకి వస్తుంటే, ఆ ఇద్దరూ ఆ ప్రచారాన్ని ఖండిస్తూ, తమ మధ్య అలాంటి అనుబంధం లేదని చెబుతూ వస్తున్నారు. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మూడేళ్ల నుంచీ.. ఈ ఏడాది ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని చెప్పుకుంటూ వస్తున్నా, ఆ మాటలు ఇంతవరకూ వాస్తవ రూపం దాల్చలేదు.ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ. హిరాణీ రూపొందించిన ఫేమస్ ఫిలింస్ ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘3 ఇడియట్స్’ సినిమాల్ని ప్రభాస్ 20 కంటే ఎక్కువసార్లు చూశాడు.ప్రభాస్ అన్నింటికంటే ఎక్కువగా ఇష్టపడే తెలుగు సినిమా, అతని పెదనాన్న కృష్ణంరాజు టైటిల్ రోల్ పోషించగా 1976లో విడుదలైన ‘భక్త కన్నప్ప’. ఇప్పటిదాకా అతనికి 6 వేల పెళ్లి ప్రతిపాదనలు వచ్చాయి.ప్రభాస్‌కు పక్షులంటే చాలా ఇష్టం. అతని ఇంట్లోని గార్డెన్‌లో ఎన్నో రకాల పూల చెట్లతో పాటు పక్షులూ ఉంటాయి.

Tags:birthday special

Leave a Response