ప్ర‌భాస్‌తో స్పెష‌ల్ సాంగ్‌…

`RX100` చిత్రంతో హీరోయిన్‌గా తెలుగులోకి తెరంగేట్రం చేసిన పాయల్ రాజ్‌పుత్ ఇప్పుడు `వెంకీమామ‌`, `డిస్కోరాజా` చిత్రాల్లో న‌టిస్తుంది. బాల‌కృష్ణ త‌దుప‌రి చిత్రంలోకూడా హీరోయిన్‌గా పాయ‌ల్ పేరు ప్ర‌ముఖంగా విన‌ప‌డుతుంది. హీరోయిన్‌గానే కాకుండా ఈ అమ్మ‌డు `సీత‌` చిత్రంలో స్పెష‌ల్ సాంగ్‌లో నర్తించింది. తాజాగా ఈమె ప్ర‌భాస్ `సాహో`లో కూడా ఓ స్పెష‌ల్‌సాంగ్ చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు వార్త‌లు విన‌ప‌డ్డాయి. అయితే ఈ వార్త‌ల‌ను పాయ‌ల్ రాజ్‌పుత్ త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తోసిపుచ్చారు. దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్‌తో తాను స్పెషల్ సాంగ్‌ చేయబోతున్నట్లు వస్తున్న వార్తలకు చెక్ పెట్టేసిందీ పాయల్ రాజ్‌పుత్. 

Tags:Disco RajaSaahoSOng

Leave a Response