బాలకృష్ణ సరసన పాయల్ రాజ్ పుత్?

‘జై సింహా’ కాంబినేషన్ ను రిపీట్ చేయనున్న బాలకృష్ణ. సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాలో డబుల్ రోల్ ల్లో అలరించనున్న బాలకృష్ణ . ఈ సినిమా లో ఒక కథానాయికగా కన్నడ బ్యూటీ ‘హరిప్రియ’ పేరు వినిపిస్తోంది. రెండవ కథానాయికగా పాయల్ రాజ్ పుత్ పేరు తెరపైకి వచ్చింది.

‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో పరిచయమైన ఈ సుందరి, గ్లామర్ పరంగా ఫుల్ మార్కులు కొట్టేసింది. ‘వెంకీమామ’ .. ‘డిస్కో రాజా’ సినిమాల్లో ఛాన్సులు పట్టేసింది. తాజాగా బాలకృష్ణ సినిమాలోను అవకాశాన్ని దక్కించుకుందని అంటున్నారు. ఈ సినిమాకి ‘రూలర్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక ప్రతినాయక పాత్ర కోసం జగపతిబాబును తీసుకున్న విషయం తెలిసిందే.

Leave a Response