ఆ లైఫ్ నాకు సెట్ కాదులెండి!: చార్మీ

తెలుగు తెరకి కొత్త అందాన్ని అద్దిన కథానాయికలలో చార్మీ ఒకరు. ముద్దుగా .. బొద్దుగా కనిపించే చార్మీకి పెద్ద సంఖ్యలోనే అభిమానులు వున్నారు. కథానాయికగా కెరియర్ జోరుగా సాగుతూ ఉండగానే నిర్మాణ రంగంపై ఆమె దృష్టి పెట్టింది. పూరి సినిమాలకి సంబంధించిన విషయాలను దగ్గరుండి చూసుకుంటోంది.

తాజా ఇంటర్వ్యూలో ఆమెకి పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. అందుకు ఆమె స్పందిస్తూ .. ” పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు .. పిల్లల్ని కనాలనే ఉద్దేశం లేదు. అలాంటి జీవితాన్ని అనుభవించాలనే కోరిక ఎంతమాత్రమూ లేదు. నిజం చెప్పాలంటే పెళ్లి .. పిల్లలు .. ఉదయాన్నే నిద్రలేచి ఫ్యామిలీకి కావలసిన ఏర్పాట్లు చేయడం నాకు ఎంతమాత్రం సెట్ కావు. ఇండిపెండెంట్ గా ఉండటానికి ఇష్టపడతాను .. కష్టపడి పనిచేయడం వలన వచ్చే సక్సెస్ తో సంతృప్తిని పొందుతాను” అని చెప్పుకొచ్చింది.

Leave a Response