ప్రభాస్ పై పొగడ్తలు కురిపించిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్

మన తెలుగు హీరో యంగ్ రెబల్ స్టార్  ప్రభాస్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు ‘సాహో’ సినిమాపైనే వుంది. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ యాక్షన్ మూవీ నిర్మించబడుతుంది. దేశ విదేశాల్లో ఈ సినిమా షూటింగ్ చేస్తూ వస్తున్నారు’సాహో’ టీం. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్ ‘కెన్నీ బేట్స్’ ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ ను డిజైన్ చేస్తున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ .. “యాక్షన్ ఎపిసోడ్స్ లో ప్రభాస్ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నాడు. సాధారణంగా హై రిస్క్ వుండే యాక్షన్ సీన్స్ చేసిన తరువాత చాలామంది హీరోలు అలసిపోతుంటారు. అలాంటి అలసట నేను ఇంతవరకూ ప్రభాస్ లో చూడలేదు. ఉదయాన్నే సెట్స్ కి వచ్చినప్పుడు ఆయన ఎలా అయితే ఉత్సాహంగా ఉంటాడో .. ఆ రోజంతా కూడా ఆయన అంతే ఉత్సాహంగా ఉంటాడు. యాక్షన్ సీన్స్ చేసే విషయంలో ఆయనకి ఎంతమాత్రం సందేహం లేకపోవడం .. బెదురు లేకపోవడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది” అని చెప్పుకొచ్చారు మాస్టర్.

Leave a Response