సుప్రసిద్ధ రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా వారు బాహుబలి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన చిత్రం బాహుబలి. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రల్లో వచ్చిన బాహుబలి ద బిగినింగ్ చిత్రం జపాన్, చైనా వంటి దేశాల్లోనూ హౌస్ ఫుల్. అనేక అంతర్జాతీయ చిత్రోత్సవాల్లోనూ బాహుబలి స్పెషల్ స్క్రీనింగ్ లు వేశారు. తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. లండన్ లోని సుప్రసిద్ధ రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా వారు బాహుబలి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను లైవ్ ఆర్కెస్ట్రాతో వినిపించనున్నారు.ఇంగ్లీష్ కాకుండా ఇతర భాషల సినిమాలను ఇక్కడి రాయల్ ఆల్బర్ట్ హాల్ లో లైవ్ లో పెర్ఫామ్ చేయనుండడం ఇదే తొలిసారి. అక్టోబరు 19న బాహుబలి ద బిగినింగ్ చిత్రం నేపథ్య సంగీతాన్ని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా సభ్యులు లైవ్ ప్రదర్శన ఇస్తున్నారని, ఈ ప్రదర్శన కోసం ఎంతో ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నామని అన్నారు రాజమౌళి.

Tags:bahubalirajamouli

Leave a Response