ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు వెళుతున్న ఎఫ్2

తెలుగులో సంక్రాంతి సందర్భంగా వచ్చిన ఎఫ్2 చిత్రం సూపర్ హిట్ టాక్ అందుకుంది. వెంకటేష్ , వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ నటించిన ఈ చిత్రం పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా మరో గౌరవం దక్కించుకుంది. గోవాలో జరగనున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ఎఫ్2 చిత్రం కూడా ఎంపికైంది. ఈసారి టాలీవుడ్ నుంచి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు వెళుతున్న ఏకైక తెలుగు చిత్రం ఇదే. దీనిపై చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు హర్షం వ్యక్తం చేశారు.ఇతర భాషా చిత్రాలతో పోటీకి మన తెలుగు చిత్రం కూడా బరిలో ఉండడం సంతోషంగా ఉందని, ఈ అవకాశం రావడాన్ని ఓ కానుకగా భావిస్తున్నామని అన్నారు. ఎఫ్2 చిత్రాన్ని అందలం ఎక్కించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Tags:f2 movieinternational film festivalmeharintamanavarun tejVenkatesh

Leave a Response