యురేనియం వ్యర్థాలతో పంటలు పండక రైతులకు తీవ్రనష్టం

ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో యురేనియం కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు అఖిలపక్షం పేర్కొంది. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు, పరిసర ప్రాంతాల్లో అఖిలపక్ష బృందం పర్యటించింది. యురేనియం వ్యర్థాలతో పంటలు పండక రైతులకు తీవ్రనష్టం వాటిల్లుతోందని, ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపింది.యురేనియం తవ్వకాల పరిసర ప్రాంతాల్లో కనీసం తాగునీరు కూడా లేని పరిస్థితి కనిపిస్తోందని, వాతావరణం కలుషితం అవుతున్నా సీఎం స్పందించకోవడం బాధాకరం అని అఖిలపక్ష నేతలు వ్యాఖ్యానించారు. నల్లమలలో యురేనియం తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

Tags:telanganauranium

Leave a Response