పవన్ కల్యాణ్ కు 40 కోట్లు ఇస్తామని ఆఫర్..!

రాజకీయాల్లోకి వెళ్లే ముందు, వెళ్ళిన తరువాత మళ్లీ సినిమాలు చేసే ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ, ఇప్పుడు ఆయన మనసు మార్చుకున్నారు‌. సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. పవన్ సినిమా వస్తానంటే అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలే కాదు, మిగతా నిర్మాతలు కూడా అంత రెమ్యూనరేషన్ కావాలంటే అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ, దర్శకుడు ఎవరనేది క్వశ్చన్ మార్క్. పింక్ రీమేక్ లో పవన్ నటిస్తారని వార్తలు వస్తున్నా, రీ ఎంట్రీ సినిమా మాత్రం అది కాదని సమాచారం. ఇటీవల పవన్ ను కలిసిన హరీష్ శంకర్ ఒక కథ వినిపించాడట. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ లో ఆ సినిమా చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. అలాగే, దర్శకుడు క్రిష్ కూడా పవన్ ని కలిసి ఒక కథ చెప్పారని టాక్. ఇకపోతే త్రివిక్రమ్ కూడా తమ్ముడు కోసం ఒక కథ రెడీ చేసాడట. త్రివిక్రమ్, హరీష్ ఇద్దరిలో ఎవరో ఒకరి దర్శకత్వంలో పవన్ సినిమా చేయవచ్చని తెలుస్తుంది.ఒక్క సినిమాకు 40 కోట్లు ఇస్తామని ఆఫర్ చేస్తారట. ఇక పోతే ‘రెబల్’ నిర్మాతలు జె భగవాన్ రావు, జె. పుల్లారావ్ అడ్వాన్స్ ఉంది. అలాగే, దిల్ రాజుకు ఓ సినిమా చేస్తానని పవన్ మాట ఇచ్చారట. వీళ్లు కాకుండా త్రివిక్రమ్ తో వరసపెట్టి సినిమాలు నిర్మిస్తున్న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అడ్వాన్స్ కూడా పవన్ దగ్గర ఉందని సమాచారం.

Leave a Response