అల్లు అర్జున్‌ @20 ఎవరితోనో తెలుసా?

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ మహాశివరాత్రి సందర్భంగా తన అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆయన 20వ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని చిత్రవర్గాలు సోషల్‌మీడియా ద్వారా ప్రకటించాయి. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. సుకుమార్-బన్నీలది క్రేజీ కాంబినేషన్‌. వీరిద్దరూ కలిసి ‘ఆర్య’, ‘ఆర్య 2’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. బన్నీ నటించిన ‘ఐ యామ్‌ దట్‌ చేంజ్‌’ అనే షార్ట్ ఫిలింకు సుకుమార్‌ నిర్మాతగా వ్యవహరించారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం బన్నీ.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తెరకెక్కిస్తున్న ఓ చిత్రం కోసం సన్నద్ధం అవుతున్నారు. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ తర్వాత అల్లు అర్జున్‌ – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో ఎవరెవరు నటిస్తారు? ఎప్పుడు మొదలవుతుందనే విషయాలు మరి కొద్దిరోజుల్లో బయటికి రానున్నట్టు సమాచారం. సంగీత దర్శకుడిగా తమన్‌ను ఎంచుకున్నట్టు తెలిసింది. ఆయన ఇప్పటికే స్వరాలు సమకూర్చే పనులు మొదలు పెట్టినట్టు ఫిలిం వర్గాలు అంటున్నాయి. అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో పట్టాలెక్కించే అవకాశాలున్నాయి.

Image result for అల్లు అర్జున్‌ @20

Leave a Response