అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ ‘అల.. వైకుంఠపురములో’ క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే ‘సామజవరగమన’ సాంగ్ యూట్యూబ్‌లో తెలుగు సినిమా రికార్డుల్ని బద్దలు కొట్టగా, లేటెస్టుగా రిలీజ్ చేసిన రెండో సాంగ్ ‘రాములో రాములా’ టీజర్ నిమిషాల వ్యవధిలోనే లక్షల వ్యూస్ సాధిస్తూ ఆ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి నిరూపిస్తోంది. గంట తిరిగేసరికల్లా దానికి 4 లక్షల 80 వేల వ్యూస్, 60 వేలకు మించి లైక్స్ వచ్చాయంటే, ఈ సినిమాపై రోజురోజుకూ ప్రేక్షకుల్లో, అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలకు నిదర్శనమని చెప్పాలి.సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎంతో చక్కగా రాసిన ఆ పాటని సిద్ శ్రీరాం ఖూనీ చేసి పాడినా, అది బ్లాక్‌బస్టర్ హిట్టవడానికి కారణం తమన్ ఇచ్చిన ట్యూన్స్ మహిమే అనేది నిజం. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ కలిసి పాడిన ఈ పాట ఫుల్ వెర్షన్‌ను దీపావళి ముందు రోజు అంటే అక్టోబర్ 26న రిలీజ్ చేయనున్నారు. టీజర్లో కేవలం అనురాగ్ వాయిస్ మాత్రమే వినిపించింది. రేపు 26న మొత్తం పాట వచ్చాక, దానికి ఎంతటి ఆదరణ లభిస్తుందనేది ఊహాతీతం. వచ్చే సంక్రాంతికి ‘అల వైకుంఠపురములో’ మూవీ విడుదలవుతోంది. ఈ లోపు తన మ్యూజిక్‌తో ఆ సినిమాకి ఒక ఊపును తీసుకొస్తున్నాడు తమన్. ఇది త్రివిక్రమ్ తో అతనికి రెండో సినిమా. ఇదివరకు ‘అరవింద సమేత.. వీరరాఘవ’ సినిమాకు ట్యూన్స్ కట్టాడు తమన్. ఆ మూవీ సాంగ్స్ సూపర్ పాపులర్ అవడంతో మరోసారి ఈ సినిమాతో అతనికి ఛాన్స్ ఇచ్చాడు త్రివిక్రమ్. రెండు చేతులా ఆ అవకాశాన్ని ఒడిసిపట్టుకొని సూపర్ ట్యూన్స్‌తో అలరిస్తున్నాడు తమన్. రానున్న రోజుల్లో ‘అల వైకుంఠపురంలో’ సాంగ్స్ ఏ రీతిన పాపులర్ అయ్యి, సినిమాకి ఏ రేంజ్ క్రేజ్‌ను తీసుకొస్తాయో చూడాలి.
- /
- /admin
- /No Comment
- /11 views
- /ala vaikuntapuramloala vaikuntapuramlo songsallu arjunpooja hegdetrivikaram
గంట తిరిగేసరికల్లా దానికి 4 లక్షల 80 వేల వ్యూస్..!
previous article
కంట్రోల్ బోర్డు అధికారులు ప్రశంసా పత్రాలు…
next article
పవన్ కల్యాణ్ కు 40 కోట్లు ఇస్తామని ఆఫర్..!
Related Posts
- /No Comment
సినిమాకు వసూళ్లు పెరిగే అవకాశం..!
- /No Comment