‘నాన్న… నేను’ అంటు వస్తున్నాడు బన్నీ!

మళ్ళీ బన్నీ, త్రివిక్రమ్  కంబినేషన్ లో సరికొత్త చిత్రానికి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ వినిపిస్తోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమా టైటిల్ కు దగ్గరగా ఈ సినిమా టైటిల్ కూడా ఉండటం విశేషం. కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలచిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తొలి చిత్రం ‘నువ్వే నువ్వే’ నుంచి గత చిత్రం ‘అరవింద సమేత’ వరకు దాదాపు తన ప్రతీ సినిమాలో కుటుంబ బంధాలు, మానవ విలువలకు చోటిచ్చాడాయన. ఈ నేపథ్యంలో తన తదుపరి చిత్రంలో అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడు త్రివిక్రమ్. తనకు కలిసొచ్చిన కథానాయకుల్లో ఒకరైన అల్లు అర్జున్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు మాటల మాంత్రికుడు. ‘‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’’ తరువాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న కొత్త చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ కలసి నిర్మిస్తున్నాయి. త్వరలో పట్టాలెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా పూజా హెగ్డే, కేథరిన్ ట్రెసా పేర్లు వినిపిస్తున్నాయి. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తరహాలో తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతోందని సమాచారం. అలాగే టైటిల్‌గా ‘నాన్న.. నేను’ అనే పేరుని పరిశీలిస్తున్నట్లు వినిపిస్తోంది. ‘నువ్వే నువ్వే’ నుంచి ‘అరవింద సమేత’ వరకు ‘నాన్న’ చుట్టూ తిరిగే కథలతో పలు విజయాలను అందుకున్న త్రివిక్రమ్.. కొత్త చిత్రంతో మరో హిట్ కొడతాడేమో చూద్దాం.

 

Leave a Response