ఒక వైపున సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ .. మరో వైపున రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ప్రభాస్ రంగంలోకి దిగాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ‘సాహో’ చేస్తూనే, రాధాకృష్ణ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ తొలి షెడ్యూల్ ను యూరప్ లో పూర్తి చేశాడు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. దాంతో ‘సాహో’కి బ్రేక్ ఇచ్చేసి .. ఈ సినిమా షూటింగులో ప్రభాస్ పాల్గొననున్నాడు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ గురువారం నుంచి 16 రోజుల పాటు షూటింగు జరగనుంది. ప్రభాస్ .. పూజా హెగ్డే తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. 1960 కాలం నాటి నేపథ్యంలో ఈ ప్రేమకథ సాగుతుందట. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో 2020లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు అని సమాచారం.
previous article
నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా: శివాజీరాజా
next article
తమ్ముడికి నేను ఉన్నాను అంటున్న అన్న…
Related Posts
- /No Comment