నాగబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తా: శివాజీరాజా

నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీరాజా పేర్కొన్నారు. ‘మా’ ఎన్నికల్లో నాగబాబు ప్రత్యక్షంగా నరేష్‌కు సపోర్ట్ ఇస్తున్నట్టు తెలిపారు. కొత్తవారికి అవకాశమివ్వాలనే తాను నరేష్‌ ప్యానెల్‌కు సపోర్ట్ ఇస్తున్నట్టు ఆయన ‘మా’ ఎన్నికలకు ముందు ప్రకటించారు. తాజాగా శివాజీ రాజా.. ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి రుణం మాత్రం తన జీవితంలో తీర్చుకోలేనని శివాజీ రాజా పేర్కొనడం విశేషం. ఇటీవల తన ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటానని శివాజీరాజా బెదిరిస్తున్నారంటూ నరేష్ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన శివాజీరాజా తాను నరేష్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోలేదని తెలిపారు. చట్టం ప్రకారం ఈ నెలాఖరు వరకూ టైం ఉందని మాత్రమే చెప్పానన్నారు.

Leave a Response