బిగ్‌బాస్ తెలుగు మొదటి సీజన్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక లెవల్‌కి తీసుకెళితే, రెండో సీజన్‌లో నాని మొదట్లో తడబడినా.. తర్వాత పుంజుకుని షోని టాప్‌లో నిలబెట్టడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. అయితే మధ్యలో కొందరు ఆర్మీ అంటూ హడావుడి చేయడంతో షో గతితప్పిందనే భావన ఇప్పటికీ అందరిలో ఉంది. బిగ్‌బాస్ సీజన్ 2 అంతా వన్ సైడ్ వార్‌లా జరిగినట్లుగా అంతా భావించడానికి కారణం హోస్ట్ ప్లేస్‌లో శాసించేవారు లేకపోవడమే అనే కామెంట్స్ ఆ మధ్య సోషల్ మీడియాలో గట్టిగానే వినిపించాయి. మరో కారణం.. ఈ షో హైదరాబాద్ గడ్డపై జరగడం కూడా.. బిగ్‌బాస్ సీజన్ 2కు మైనస్‌గా అంతా చెప్పుకొచ్చారు. కారణాలేమైనా.. సీజన్2 మాత్రం సీజన్ 1లా రక్తికట్టలేదని నెటిజన్లు చాలా మంది అప్పట్లో వ్యక్తపరిచారు. ఇక సీజన్ 3కి టైమ్ దగ్గరకొచ్చింది. ఈ మధ్య సీజన్ 3కి మరోసారి యంగ్ టైగర్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారని టాక్ నడిచింది. కానీ ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి యంగ్ టైగర్ చేయబోతోన్న ‘ఆర్ఆర్ఆర్’ బిజీ షెడ్యూల్ వల్ల.. ఎన్టీఆర్ ఈ షోకి టైమ్ కేటాయించలేనని చెప్పేశాడట. ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్ 3 కోసం హోస్ట్‌ను వెతికే వేటలో ఉన్నారట ఈ కార్యక్రమ నిర్వాహకులు.
previous article
ఆర్య , సాయేషాకు మళ్లీ పెళ్లి అంట…!
next article
నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా: శివాజీరాజా
Related Posts
- /No Comment