బాల్లయ్య పుట్టినా రోజు సందర్బంగా సినీ పరిశ్రమ సందడి…

టాలీవుడ్ నటరత్నం నంద‌మూరి బాల‌కృష్ణ. అభిమానులు బాలయ్య అని ముద్దుగా పిలుచుకుంటారు. తన నటనతో టాలీవుడ్ లో సంచలం సృష్టించారు. 1974 లో తాతమ్మకల సినిమాతో తెలుగు సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టారు.1994 లో భైరవద్వీపం చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్ అవార్డు. 2నరసింహ నాయుడు (2001), సింహా ( 2010) చిత్రాలకు ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు,నరసింహనాయుడు చిత్రానికి గాను సినీగోయర్స్ అసోసియేషన్ బెస్ట్ యాక్టర్ అవార్డు. 2007 లో అక్కినేని అభినయ పురస్కారంతో సత్కరించారు, పాండు రంగడు, సింహా, శ్రీరామరాజ్యం చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా భరతముని అవార్డు, లెజెండ్ చిత్రానికి గాను 2014 ఉత్తమ కథనాయకునిగా SICA అవార్డు, ఇళ్ల ఎన్నో అవార్డులను అందుకున్నారు. నేటితో తను 59 సంవత్సరాలు పూర్తిచేసుకున్నారు. ప్రస్తుతం మన బాల్లయ్య 59వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు.ఇక ఆయ‌న అభిమానులు ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. జన్మదినం సందర్భంగా బాలయ్యకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు విష్ చేస్తున్నారు. ద‌ర్శ‌కుడు కేఎస్ ర‌వికుమార్‌, నిర్మాత సి.క‌ల్యాణ్ బాల‌య్య‌ను క‌లిసి పుష్పగుచ్చం అందించి జ‌న్మ‌దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. బ‌ర్త్‌డే సంద‌ర్భంగా బాలయ్య కొత్త సినిమా గురించి ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని అభిమానులు ఆశించారు. అయితే బాల‌య్య కొత్త సినిమా గురించి ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాక‌పోవ‌డం అభిమానుల‌ను నిరాశ‌ప‌రిచింది. కేఎస్ ర‌వికుమార్‌తో బాల‌య్య ఓ సినిమా చేయ‌బోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. కేఎస్ ర‌వికుమార్‌, సి.క‌ల్యాణ్ ఇద్దరూ బాలయ్యను కలిసిన నేపథ్యంలో త్వరలోనే ముగ్గురి కాంబినేషన్‌లో సినిమా ప్రారంభం కానుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇంకా ఇళ్ల ఎన్నో సినిమాలతో అభిమానుల ముందుకు రావాలని సినీ పరిశ్రమ కోరుకుంటుంది.

Image result for balakrishna
Tags:Bala Krishna BirthdayBalayaBalaya BirthdayBalaya fansBirthday

Leave a Response