పాకెట్‌ మనీ కోసమే అల్లా చేశాను…

టాలీవుడ్ అందాల సుందరి నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌. చాలా కష్టపడి హీరోయిన్ కావాలంటే ప్రతి ఒకరికి ఏదో ఒక కారణం ఉందని చెబుతుంటారు. మరి ఈ అమ్మడుకి ఏంటి కారణం..?ఈ సుందరి టాలీవుడ్‌లో రెండు మూడు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒక్కో చిత్రమే రకుల్‌ప్రీత్‌సింగ్‌ చేతిలో ఉన్నాయి. ఇకపోతే కోలీవుడ్‌లో సూర్యతో నటించిన ఎన్‌జీకే చిత్రంపై ఈ భామ చాలా ఆశలు పెట్టుకోనుంది. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం కూడా నిరాశపరిచింది. దీని గురించి రకుల్‌ప్రీత్‌సింగ్‌ తాను ఎన్‌జీకే చిత్రంలో నటించడానికి ప్రధాన కారణాలు రెండు అని చెప్పుకొచ్చారు. దర్శకుడు సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో నటిస్తే నటనను మరింత మెరుగుపరుచుకోవచ్చునని, ఇక రెండో విషయం హీరో సూర్య కావడం అన్నారు. దర్శకుడు సెల్వరాఘవన్‌ ఇంతకు ముందు తెరకెక్కించిన 7జీ.రెయిన్‌బో కాలనీ, కార్తీ హీరోగా నటించిన ఆయిరత్తిల్‌ ఒరువన్‌ చిత్రాలు తనను బాగా ఆకట్టుకున్నాయన్నారు. నిజంగానే సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో నటించడం వినూత్న అనుభంగా పేర్కొన్నారు. తాను కార్తీ, సూర్య ఇద్దరితోనూ నటించానని, ఇద్దరూ చాలా భిన్నమైన వ్యక్తులని తెలిపారు. సూర్య, కార్తీ ఇద్దరూ కఠిన శ్రమజీవులు అన్నారు.

Image result for rakul preet singh

ఎలాంటి గర్వం లేకుండా చేసేపనిని ఇష్టపడి చేస్తారని అంది. తనకు తమిళం కంటే తెలుగు భాష బాగా తెలుసని, తెలుగులో సరళంగా మాట్లాడగలనన్నారు. తమిళ సినిమాలు అయితే సంభాషణలను హిందీలో రాసుకుని చెబుతానని, అది కాస్త కష్టతరం అయినా సవాల్‌గా తీసుకుని నటిస్తానని చెప్పారు. ఇంకో విషయం ఏమిటంటే తాను మొదట పాకెట్‌ మనీ కోసమే సినిమాల్లో నటించానని తెలిపారు. ఆ తరువాత కెమెరా ముందు నిలబడి నటించడం చాలా నచ్చడంతో పూర్తిగా నటిగా మారిపోయానని రకుల్‌ప్రీత్‌సింగ్‌ చెప్పుకొచ్చారు.

Leave a Response