పెళ్ళికి ముందే ఈ మూడు ఉండాలి …

టాలీవుడ్ హాట్ హీరోయిన్ 2000లో తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన “హే రాం” సినిమాలో బాల్యనటిగా నటించిన శ్రుతి హాసన్ ఆ తర్వాత సంగీతానికి సంబంధించిన విషయాలపై శ్రద్ధ చూపింది. 2008లో సోహం షా దర్శకత్వంలో తెరకెక్కిన “లక్” సినిమాలో ఇమ్రాన్ ఖాన్ సరసన నటించి సినీ ఇండస్టీలో అడుగుపెట్టింది. ఆ సినిమా ఘోరపరాజయాన్ని చవిచూసింది. శ్రుతికి కూడా తన నటనకు విమర్శకుల నుంచి ప్రతికూల స్పందన వచ్చింది. 2011లో కె. రాఘవేంద్రరావు కొడుకైన కె.ప్రకాష్ దర్శకత్వంలో సిద్దార్థ్ సరసన “అనగనగా ఓ ధీరుడు” సినిమాలో నటించింది. విమర్శకుల నుంచి తన నటనకు ప్రశంసలనందుకున్న శ్రుతికి మాత్రం ఈ సినిమా కమర్షియల్ గా పరాజయంగానే మిగిలింది కానీ ఆ సంవత్సరానికి తను ఉత్తమ తెలుగు నూతన నటి విభాగంలో దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డును పొందింది. అదే సంవత్సరంలో “దిల్ తో బచ్చాహై జీ” సినిమాలో అతిథి పాత్రలో నటించిని శ్రుతి ఆపై ఏ. ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో సూర్య సరసన “7అం అరివు” సినిమాలో నటించింది. సెవెంత్ సెన్స్ పేరుతో తెలుగులో విడుదలైన ఈ సినిమా విజయం సాధించింది.

Image result for shruti hassan

శ్రుతికి కూడా తన నటనకు గుర్తింపు లభించడమే కాకుండా ఉత్తమ తమిళ నూతన నటి విభాగంలో దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. ఆ సంవత్సరంలో తన చివరి సినిమా సిద్ధార్థ్ సరసన ఓ మై ఫ్రెండ్ సినిమాలో నటించింది. చిరంజీవి నటించిన “ఇద్దరు మిత్రులు” సినిమాకి దగ్గరగా ఉండే ఈ సినిమా ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత శ్రుతి ఒక నటిగా తెలుగులో మంచి గుర్తింపును సాధించింది. ఇక ధనుష్ సరసన 3 సినిమాలో నటించి విమర్శకులనుంచి ప్రశంసలనందుకున్న తర్వాత శ్రుతి హాసన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సరసన “గబ్బర్ సింగ్” సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాక విమర్శకుల మరియూ ప్రేక్షకుల దృష్టిలో శ్రుతి హాసన్ స్థాయిని పెంచింది. తనని నటిగా తెలుగు సినిమాల్లో నిలబెట్టింది. ప్రస్తుతం శ్రుతి తెలుగులో రవితేజ సరసన “బలుపు”, జూనియర్ ఎన్.టి.ఆర్. సరసన “రామయ్యా వస్తావయ్యా”, హిందీలో ప్రభుదేవ దర్శకత్వంలో “రామయ్యా వస్తావయ్యా”, “డీ-డే” సినిమాల్లో నటిస్తోంది. ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉందన్నా విషయం మన అందరి తెలిసిందే. ఇక ఈ అమ్మడు ‘‘సెన్సాఫ్‌ హ్యూమర్‌… ఇంటిలిజెన్స్‌… విల్‌ పవర్‌… కాబోయే భర్తలో ఈ మూడు లక్షణాలు ఉండాలి. అబ్బాయి స్టుపిడ్‌లా అసలు ఉండకూడదు’’ అని అన్నారు. మీకు కాబోయే భర్త ఎలా ఉండాలని తాజా ఇంటర్వ్యూలో ఆమెకు ఓ ప్రశ్న ఎదురైంది. ముందు ‘నాకు భర్త అవసరం లేదు’ అన్నట్టు ‘‘ఐ డోంట్‌ నీడ్‌…’’ అనేశారు శ్రుతి. తర్వాత ‘‘ఒకవేళ పెళ్లి చేసుకోవాలనిపిస్తే…’’ అని సమాధానం ఇచ్చారు. ఇంకా శ్రుతీ హాసన్‌ మాట్లాడుతూ ‘‘నాకు సహనం చాలా తక్కువ. ప్రపంచంలో స్టుపిడ్‌ పీపుల్‌ ఎక్కువమంది ఉన్నారు. వాళ్ళను భరించడం కష్టం’’ అన్నారు. త్వరలో తెలుగు సినిమా చేస్తున్నానని స్పష్టం చేశారామె. రవితేజ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో శ్రుతీ హాసన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Tags:IntelligenceKamal HaasanRavitejaSense Of HumorShrutiShruti Haasan

Leave a Response