అబ్బే పెళ్లిపై నాకు నమ్మకం లేదు..

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ నటించిన ‘భారత్’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న 53 ఏళ్ల బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ పెళ్లిపై తనకున్న అభిప్రాయాన్ని బయటపెట్టాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు దీపక పదుకొనే, రణ్‌వీర్ సింగ్, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, సోనమ్ కపూర్ తదితరులంతా ఇప్పటికే ఓ ఇంటి వారయ్యారని, మరి మీ సంగతేంటని ప్రశ్నించిన జర్నలిస్టుతో తన మనసులోని మాటను చెప్పేశాడు. తనకు పెళ్లిళ్లపై అస్సలు విశ్వాసం లేదన్నాడు. పెళ్లి అనేది ఓ మరణిస్తున్న సంస్థ అని పేర్కొన్నాడు. పెళ్లి చేసుకోవడం కంటే సాహచర్యమే బెటరని ఈ కండలవీరుడు తేల్చి చెప్పాడు.

Image result for salman khan image

Leave a Response