టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు, తమిళ్ సినిమాల్లో నటిస్తుంది. తమన్నా(2005)లో చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అదే ఏడాది శ్రీ సినిమాతో తెలుగులో, (2006)లో కేడీ సినిమాతో తమిళంలో అడుగుపెట్టింది. (2007)లోమూడూ విఫలమైనా సినిమాలు లో నటించింది. మొదటిది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్, బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో వచ్చిన తమిళ్ సినిమా కళ్ళూరి తమన్నాకి సరైన గుర్తింపును ఇచ్చాయి. ఆపై అయన్ (2009), కండేన్ కాదలై (2009), పయ్యా (2010), సిరుతై (2011), వీరం (2014) వంటి సినిమాల ద్వారా తమిళ్ సినీ పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 2009లో కిషోర్ కుమార్ పార్దాసాని దర్శకత్వంలో వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం, సుకుమార్ దర్శకత్వంలో 100% లవ్ సినిమాల ద్వారా తెలుగులో గుర్తింపు సాధించిన తమన్నా ఆపై ఊసరవెల్లి (2011), రచ్చ (2012), కెమెరామెన్ గంగతో రాంబాబు (2012), తడాఖా(2013) వంటి చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఆపై హిమ్మత్‍వాలా చిత్రం ద్వారా తిరిగి హిందీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా విఫలమైనా తమన్నాకి మరెన్నో హిందీ సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. ప్రస్తతం ఈ అమ్మడు హారర్ సినిమాల మీదే ఎక్కువ దృష్టి మార్లించింది. ఆమె చేతిలో ఉన్న సినిమాలు, ఇటీవల రిలీజ్ అయిన సినిమాలను గమనిస్తే ప్రేక్షకులను భయపెట్టే హారర్ మూడ్‌లోనే తమన్నా ఉన్నట్టు అనిపిస్తోంది. గత వారంలో ‘దేవి 2’ సినిమాలో తమిళ్, తెలుగు అభిమానులను భయపెట్టిన ఆమె వచ్చే వారం ‘కామోషి’ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులనూ భయపెట్టనున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న మరో తమిళ సినిమా కూడా హారర్ చిత్రమే. విశేషమేటంటే ఆ సినిమా తాప్సీ నటించిన ‘ఆనందో బ్రహ్మ’ చిత్రానికి రీమేక్ అని తెలిసింది. రోహన్ వెంకటేశన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సింగిల్ షెడ్యూల్‌లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయనున్నారట.
