టాలీవుడ్ సంగీత ప్రియుల కోసం ‘నీలాకాశం’ అనే సరికొత్త తెలుగు ఆల్బమ్ విడుదలైంది. రచయిత, సంగీత దర్శకుడు, గాయలు మొదలుకొని అంతా కొత్తవారితో ఈ ఆల్బమ్‌ను రూపొందించారు. సీతారామరాజు అనే కొత్త సంగీత దర్శకుడు ఈ ఆల్బమ్ ద్వారా పరిచయం కాబోతున్నారు. కృష్ణ తేజస్వి, ఆశిక్ అలీ, అఖిలేశ్వర్ చెన్ను, నికిత శ్రీవల్లి, మనీషా పండ్రంకి తదితర గాయకులు ఈ ఆల్బమ్‌కు పాడారు. ఈ టీమ్ వైజాగ్, చెన్నై, ముంబై మొదలగు చోట్ల స్టూడియోలలో శ్రమించి ఆహ్లాదమైన పాటలను ముందుకు తీసుకు వచ్చారు. ఈ ఆల్బమ్ ‘వాటర్ లెమన్ రికార్డ్స్’ అనే కొత్త ఆడియో సంస్థ ద్వారా మార్కెట్లోకి వచ్చింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ శనివారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో ‘నీలాకాశం’ ఆల్బమ్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా థమన్ మాట్లాడుతూ…‘‘ఆశీర్వాద్ గారితో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. చెన్నైలో తరచూ కలుస్తుంటాము. మా నాన్న గారితో ఆయనకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. అందువల్లే నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. లైట్ మ్యూజిక్ చాలా పాటలకు ఇన్స్పిరేషన్ మాత్రమే కాదు.. అదొక మెడిసిన్ కూడా. ఇలాంటి లైట్ మ్యూజిక్‌ను సీతారామరాజు, ఆశీర్వాదం గారు సంగీత ప్రియులకు అందించే ప్రయత్నం చేయడం ఎంతో గొప్ప విషయం. ఈ ‘నీలాకాశం’ ఆల్బమ్ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సింగర్స్ అందరికీ బెస్ట్ విషెస్ తెలువుతున్నా’’ అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. ‘‘ఘంటసాల గారు అప్పట్లో ఇలాంటి లైట్ మ్యూజిక్‌నే చేసేవారు. అలాంటి మ్యూజిక్ వల్లే ఎన్నో సినిమాల్లో ఎన్నో హిట్స్ సాంగ్స్ వచ్చాయి. ఆ తరాన్ని అనుసరిస్తూ ఇప్పుడు ‘నీలాకాశం’ అనే లైట్ మ్యూజిక్ ఆల్బమ్‌ను తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉంది. వీరి స్ఫూర్తితో మరెన్నో లైట్ మ్యూజిక్స్ రావాలని కోరుకుంటున్నాను.’’ అన్నారు. ‘‘మేము అడగ్గానే ‘నీలాకాశం’ ఆల్బమ్‌కు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలను తెలియచేస్తున్నా’’ అని సీతారామ్ రాజు అన్నారు.
- /
- /admin
- /No Comment
- /275 views
- /Music DirectorMusic Director SS ThamanNeelakashamNeelakasham albumSS ThamanTollywood
‘నీలాకాశం’ సినిమా ఆల్బమ్ విడుదల చేసాడు థమన్…
Tags:Music DirectorMusic Director SS ThamanNeelakashamNeelakasham albumSS ThamanTollywood
previous article
బాల్లయ్య పుట్టినా రోజు సందర్బంగా సినీ పరిశ్రమ సందడి…
next article
గిరీష్ కర్నాడ్ కన్నుమూత….