రామ్ గోపాల్ వర్మ ప్రెస్ మీట్ కి కారణాలు..?

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్‌వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఏపీలో విడుదలకు సిద్ధమైంది. ఏపీలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో సినిమా విడుదలను నిలిపివేశారు. ఇక ఎన్నికల కోడ్ ముగియనుండడంతో ఈ సినిమాను మే 31న విడుదల చేయబోతున్నట్టు వర్మ ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు తెలియజేసాడు. మే 30న వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని, మే 31న సినిమాను అక్కడ విడుదల చేస్తామని వర్మ పేర్కొన్నారు. ఈ రెండు కార్యక్రమాలు వైఎస్సార్, ఎన్టీఆర్ ఆశీస్సులతో జరగనున్నాయని వర్మ ట్వీట్‌లో తెలిపారు. ఈ సినిమా పై ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని ఫిలిం ఛాంబర్ లో ప్రెస్ మీట్ పెడుతున్నాడు. గతంలో వర్మ ప్రెస్ మీట్ ని పోలీసుకు అడ్డుకున్నారన విషయం తెలిసిందే. “ఇప్పుడు దమ్ము ఉంటె నా ప్రెస్ మీట్ ని అప్పుకో” అన్ని చంద్రబాబు పై సవాలు విసిరాడు వర్మ. ఇంతకీ వర్మకి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది..? అనే ప్రశ్న హల్ చల్ చేస్తుంది.Image may contain: 1 person, text

Leave a Response