మంగళ వారం హైదరాబాద్ లో డిస్కోరాజా…

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో `డిస్కోరాజా` సినిమా అభిమానుల ముందుకు వస్తుంది. ఎస్.ఆర్ టి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. ఈ షెడ్యూల్‌లో హీరో రవితేజ స‌హా ముఖ్య పాత్రధారులు పాల్గొంటున్నారు. హైద‌రాబాద్ అల్యూమినీయం ఫ్యాక్ట‌రీలో భారీగా వేసిన‌ సెట్‌లో ప్ర‌స్తుతం హీరో, విలన్ మ‌ధ్య పోరాట స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ‌ఈ చిత్రంలో `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ పాయల్ రాజ్ పుత్, `నన్ను దోచుకుందువటే` ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

Leave a Response