నా గది లో ఇప్పుడు అమ్మాయిలు…

టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తను చదువుకునే రోజులను గుర్తుచేసుకున్నారు. విజయవాడలో వర్మ చదువుకున్న రోజుల్లో సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ వెనుక ఉన్న ఓ గదిలో అద్దెకు ఉన్నానని చెబుతూ ఓ పోస్ట్ చేశారు. ఈ గదిలో రెండేళ్లకు పైబడి తాను అద్దెకు ఉన్నానని, ఇప్పుడు ఆ గది ఉమెన్స్ హాస్టల్ గా మారిందని చెప్పారు. ఆ గదిలో ఉంటున్న అమ్మాయిలతో కలిసి దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేశారు. తన వెనుక ఉన్న గోడకే నటి శ్రీదేవి పోస్టర్ ను అతికించే వాడినని వర్మ ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.

Leave a Response