చిరంజీవి అబద్ధాలు చెబుతున్నారు..!

‘సైరా నరసింహారెడ్డి’ సినిమా విడుదలను అడ్డుకుంటామంటూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబీకులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ నరసింహారెడ్డి వారసులమంటూ 25 కుటుంబాల వారు ఒక్కొక్క కుటుంబానికి రూ. 2 కోట్లు చొప్పున డిమాండ్ చేస్తున్నారని… దాదాపు రూ. 50 కోట్లు ఎక్కడ నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు. దీనిపై ఉయ్యాలవాడ కుటుంబీకులు స్పందిస్తూ చిరంజీవి అబద్ధాలు చెబుతున్నారని అన్నారు.చరణ్ చెప్పినట్టుగా తాము ఒక్కో కుటుంబానికి రూ. 15 లక్షలు అడిగామని అన్నారు. సినిమాకు సంబంధించి తాము వేసిన కేసులను వెనక్కి తీసుకుంటున్నామని అన్నారు.

Tags:saira narasimha reddy

Leave a Response