18 ఏళ్ల నా సినిమా ప్రయాణం….

టాలీవుడ్ అందాల సుందరి చార్మీ. స్టార్ హీరోలందరితోను వరుస అవకాశాలను దక్కించుకుంటూ కుర్రకారును హుషారెత్తించిన చార్మీ, ఆ తరువాత సినిమా నిర్మాణం వైపు దృష్టి పెట్టారు. తాజాగా ఆమె మాట్లాడుతూ .. “18 ఏళ్ల క్రితం ఇదే రోజున నేను కెమెరా ముందుకు వచ్చాను. తొలిసారిగా ముంబైలోని ‘మెహబూబ్’ స్టూడియోలో అడుగుపెట్టినప్పుడు, అదొక కొత్త ప్రపంచంలా అనిపించింది. టీనేజ్ లోనే హీరోయిన్ గా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన నేను ఎన్నో విజయాలను అందుకున్నాను .. మరెన్నో పరాజయాలను ఎదుర్కొన్నాను. కథానాయికగా నా ప్రయాణంలో నా కుటుంబం నాకు ఎంతో అండగా నిలిచింది. నిర్మాణ రంగంలోను నాకు వాళ్ల ప్రోత్సాహం వుంది. ప్రస్తుతం నేను చాలా హ్యాపీగా వున్నాను” అని చెప్పుకొచ్చింది. Image result for charmi

Leave a Response