ఆట ఆడుతున్న తాప్సి…

టాలీవుడ్ అందాల సుందరి తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా ‘గేమ్‌ ఓవర్‌’. అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వంలో వై నాట్‌ స్టూడియోస్‌ పతాకంపై ఎస్‌. శశికాంత్‌ నిర్మించారు. ఈ సినిమా జూన్‌ 14న విడుదల చేయనున్నట్టు నిర్మాత శశికాంత్‌ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘మేం నిర్మించిన ‘లవ్‌ ఫెయిల్యూర్‌’, ‘గురు’ తెలుగులో ఘన విజయాలు సాధించాయి. సరికొత్త కథ, కథనాలతో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ ‘గేమ్‌ ఓవర్‌’ కూడా ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకముంది’’ అన్నారు. తాప్సీ మాట్లాడుతూ ‘‘ఈ కథ విన్నప్పుడే కొత్తగా ఉందని, తప్పకుండా విజయం సాధిస్తుందని అనిపించింది. ‘ఆనందో బ్రహ్మ’ తర్వాత తెలుగు ప్రేక్షకులు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఈ చిత్రం వమ్ము చేయదు’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: వెంకట్‌ కాచర్ల, సహ నిర్మాత: చక్రవర్తి రామచంద్ర.Image result for thaapsi

Leave a Response