యాత్ర 2 లో జగన్…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ దివంగ‌త ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర చేసిన స‌మయంలో జ‌రిగిన ప‌రిణామాల దృష్టిలో పెట్టుకుని డైరెక్ట‌ర్ మ‌హి వి.రాఘ‌వ్ `యాత్ర` అనే సినిమాను చేసిన సంగ‌తి మన అందరికి తెలిసిందే. వై.ఎస్‌.ఆర్ పాత్ర‌లో మమ్ముట్టి నటించారు. ఇప్పుడు ఈ దర్శ‌కుడు `యాత్ర 2` చేయాలనుకుంటున్నారా? అనే ప్రశ్నకు ఇండ‌స్ట్రీ నుండి అవును అనే స‌మాధానం వ‌స్తుంది.  ద‌ర్శ‌కుడు కూడా రీసెంట్‌గా జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాల్లో విజ‌యం సాధించిన జ‌గ‌న్‌ను ఉద్దేశిస్తూ చేసిన అభినంద‌న‌ Image result for yatra movie directorట్వీట్‌లో హాష్ ట్యాగ్ `యాత్ర 2` అని జ‌త చేయ‌డం కొస మెరుపు.`యాత్ర` నిర్మాత శివ మేకను కూడా ఇందులో ట్యాగ్ చేయడం గమనార్హం. వై.ఎస్‌.ఆర్ పాద‌యాత్ర‌పై `యాత్ర` సినిమా చేశాడు గా మ‌హి.వి.రాఘ‌వ్‌. మ‌రి ఇప్పుడు `యాత్ర 2` అనే వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.. ఒక‌వేళ అన్నీ అనుకున్న‌ట్లు కుదిరితే డైరెక్ట‌ర్ మ‌హి వై.ఎస్‌.జ‌గ‌న్ పాదయాత్ర‌పై `యాత్ర 2` చేస్తాడేమో? చూడాలి. అలాగే `యాత్ర‌` స‌మ‌యంలో వై.ఎస్‌.జ‌గ‌న్ పాత్ర‌లో హీరో సూర్య లేదా అత‌ని తమ్ముడు కార్తి న‌టిస్తార‌ని వార్త‌లు వినిపించాయి. కానీ యాత్ర‌లో జ‌గ‌న్ పాత్ర‌ను తెర‌పై చూప‌నేలేదు. మ‌రిప్పుడు యాత్ర 2లో జ‌గ‌న్ పాత్ర‌లో సూర్య, కార్తిల్లో ఎవ‌రైనా న‌టిస్తారా? లేక మ‌రో హీరో ఎవ‌రైనా న‌టిస్తారేమో చూడాలి.

Leave a Response