రష్మిక కు ప్రేమ లేఖ….?

టాలీవుడ్..కోలీవుడ్ లో నటించి తన కంటూ ఓ స్థాయిని తెచ్చుకుంది రష్మిక. వరుస విజయాలతో దూసుకుపోతోంది ఈ అమ్మడు. ఒక సినిమా నుంచి మరో సినిమాకి తన పై చూపించే అభిమానం పెరుగుతుంది. ఆ అభిమానంతో ఒక అభిమాని ఈ చిన్నదాన్ని కి ప్రేమలేఖ రాసాడు. ఇప్పుడు ఆ లేఖ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.Image result for rashmika

“రష్మిక గారు .. మీరంటే నాకు పిచ్చి అభిమానం. మీ అందం .. నవ్వు .. అభిమానుల పట్ల మీరు చూపే గౌరవం నన్ను మీ అభిమానిగా మార్చేశాయి. ఈ భూమ్మీద నేను మిమ్మల్ని ఇష్టపడినంతగా మరెవరూ ఇష్టపడలేరేమో. నా హృదయంలో మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. తొలిసారిగా మిమ్మల్ని తెరపై చూసినప్పుడు గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను .. చదువుపై దృష్టిపెట్టలేకపోతున్నాను. నాకు తెలుగు .. కన్నడ భాషలు తెలియవు. ప్రేమకి భాష అవసరమేకానీ .. అడ్డంకి కాదు అనే విషయం మరోమారు రుజువైంది” అని ఆ అభిమానుడు తెలియజేశాడు. 

Leave a Response