వరుస సినిమాలు చేస్తున్న…సూర్య..?

ఒక సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే .. మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నాడు మన సూర్య. సెట్స్ పై వున్న సినిమా కొంతవరకూ షూటింగ్ జరుపుకోగానే మరో ప్రాజెక్టు ఒకే చేస్తున్నాడట. ఆయన ఎంతమాత్రం గ్యాప్ లేకుండా దూసుకుపోతున్నాడు. ‘గురు’ ఫేమ్ సుధా కొంగరకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. తాజాగా ఈ సినిమాకి ‘సూరారై పొట్రు’ అనే టైటిల్ ఖరారు చేసి, టైటిల్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో సూర్య సరసన నాయికగా ‘అపర్ణ బాలమురళి’ని తీసుకున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Leave a Response