ప్రతిదీ ఓ లెక్కే…..

మన తప్పొప్పుల్ని ఎత్తి  చూపేందుకు కొంతమంది ఉండాల్సిందే’’ అంటోంది కథానాయిక కాజల్‌ అగర్వాల్‌. సుదీర్ఘకాలంగా సినీ ప్రయాణం చేస్తున్న కథానాయికల్లో ఈమె ఒకరు. ప్రస్తుతం వాణిజ్య ప్రధానమైన చిత్రాలతో పాటు.. నటనకి ప్రాధాన్యమున్న పాత్రల్నీ చేస్తోంది. సినిమా ఫలితాలు మీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంటాయని అడిగితే… ‘‘వాటిని అస్సలు పట్టించుకోనని నేను చెబితే అది అబద్ధం అవుతుంది. విజయమైనా, పరాజయమైనా… ప్రతిదీ లెక్క పెట్టుకొంటా. కాకపోతే ఆ ఫలితాల్ని మరీ వ్యక్తిగతంగా  తీసుకోను. చిత్ర పరిశ్రమ బయట నాకు కొద్దిమంది స్నేహితులు ఉన్నారు. వాళ్లు నా జయాపజయాలతో సంబంధం లేకుండా నాలోని మంచి చెడులు చెబుతుంటారు. నేను బాధపడినా సరే… నాతో నిజం చెప్పడానికి ఏమాత్రం వెనకాడరు. ఎలాంటి విషయాన్నైనా నిర్మొహమాటంగా చెబుతుంటారు. అలాంటి వాళ్లు మన చుట్టూ ఉన్నప్పుడే మనకు  వాస్తవాలేంటో తెలుస్తాయ’’ని చెప్పుకొచ్చింది కాజల్‌.

Leave a Response