సస్పెన్స్ థ్రిల్లర్ గా ‘సెవెన్’

టాలీవుడ్ కొత్త హీరో హవీశ్ .. రెజీనా .. నందిత శ్వేత .. రెహ్మాన్ ప్రధాన పాత్రధారులుగా ‘సెవెన్’ సినిమా నిర్మితమైంది. రమేశ్ వర్మ నిర్మించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కి నైజర్ షఫీ దర్శకుడిగా వ్యవహరించాడు. రంజాన్ పర్వదినం సందర్భంగా ఈ సినిమాను ఈ నెల 5వ తేదీన విడుదల చేయనున్నారు.

Related image

ఈ సందర్భంగా హవీశ్ మాట్లాడుతూ .. “నిజం చెప్పాలంటే థ్రిల్లర్ సినిమాల పట్ల నేను పెద్దగా ఆసక్తిని చూపను. కానీ ఈ కథ విన్న వెంటనే .. ‘ఈ సినిమాను మనం చేస్తున్నాము’ అని దర్శకుడికి చెప్పేశాను. అంతగా ఈ కథ నాకు నచ్చేసింది. అనూహ్యమైన సంఘటనలతో .. ఉత్కంఠభరితమైన మలుపులతో ఈ సినిమా సాగుతుంది. ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమా కట్టిపడేస్తుందనే నమ్మకం వుంది. నా కెరియర్ కి ఈ సినిమాకి తప్పకుండా హెల్ప్ అవుతుంది” అని చెప్పుకొచ్చాడు.

Leave a Response