నిహారికతో నాకు ప్రేమ వ్యవహారంలేదు…

టాలీవుడ్ సీనియర్ హీరో నాగబాబు తనయ కొణిదెల నిహారిక సినీ రంగంలో తనదైన ముద్రవేసేందుకు ప్రయత్నిస్తోంది. వెబ్ సిరీస్ లు, సినిమాలతో కెరీర్ లో క్రమంగా ఎదుగుతోంది. అయితే, నిహారికతో కొందరు హీరోలకు లింకు పెడుతూ ఎన్నో కథనాలు వస్తున్నాయి. అలాంటి హీరోల్లో నాగశౌర్య ఒకడు. నిహారిక, నాగశౌర్య జోడీగా ‘ఒక మనసు’ అనే చిత్రంలో నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందంటూ ప్రచారం జరిగింది. అప్పట్లోనే ఇది నిజం కాదంటూ నాగశౌర్య క్లారిటీ ఇచ్చాడు. అయితే, నిహారిక ఇటీవల ఓ చిన్నారిని ఎత్తుకున్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయగా, దానిపై నాగశౌర్య కామెంట్ చేశాడు. అప్పటినుంచి మళ్లీ ఇద్దరి మధ్య ప్రేమ అంటూ ఊహాగానాలు బయల్దేరాయి. ఈ నేపథ్యంలో, తమ మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారంలేదని ఈ యువ హీరో స్పష్టంగా చెప్పాడు. నిహారికతోనే కాదు, తనకు ఎవరితోనూ లవ్ అఫైర్ లేదని స్పష్టం చేశాడు. తాను, నిహారిక పెళ్లి చేసుకోబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆఖరికి, ఫ్రెండ్స్ కూడా “మీ లవ్ స్టోరీ చెప్పు” అంటూ ఫోన్లు చేస్తున్నారని నాగశౌర్య తెలిపాడు.

Image result for niharika and naga shourya

Leave a Response