ఆరేళ్ల త‌ర్వాత ఇప్పుడు హిట్ కాంబినేష‌న్‌…

టాలీవుడ్ మాస్ మహా రాజా రవితేజ‌, శృతిహాస‌న్ ఆరేళ్ల త‌ర్వాత ఇప్పుడు ఈ హిట్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రూపొంద‌నుంది. ఇప్ప‌టికే రవితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీకి రంగం సిద్ధ‌మ‌వుతుందని వార్త‌లు వినిపించాయి. లేటెస్ట్‌గా ఈ చిత్రంలో శృతిహాస‌న్‌ను హీరోయిన్‌గా తీసుకోబోతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

Related image

ఒక‌ప్పుడు బిజీ హీరోయిన్‌గా ఉన్న శృతిహాస‌న్ త‌న‌కు తానుగా సినిమా రంగానికి దూర‌మైంది. బాయ్‌ఫ్రెండ్ మైకేల్‌ను పెళ్లి చేసుకుని సెటిలైపోతుందేమోన‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ పెళ్లి చేసుకోలేదు. కొన్ని నెల‌ల క్రితం వ‌ర‌కు మ్యూజిక్ లైవ్ కాన్‌స‌ర్ట్స్‌లో పాల్గొంటూ బిజీగా ఉండింది. మ‌ళ్లీ సినిమా రంగంవైపు దృష్టి సారించిందట‌. మంచి అవ‌కాశాల కోసం ఎదురుచూస్తుందని, ఈ త‌రుణంలో ర‌వితేజ సినిమాను కాద‌నే ప్ర‌సక్తే ఉండ‌క‌పోవ‌చ్చునని అంటున్నాయి సినీ వ‌ర్గాలు.

Leave a Response