విశాల్ వివాహానికి విరామం..?

తమిళ నటుడు విశాల్, మన తెలుగు వారికీ కూడా సుపరిచితుడే. ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలను ఎంచుకొని ,అందులో నటించకుండా, జీవిస్తాడు. పందెంకోడి, డిటెక్టర్ వంటి ఎన్నో హిట్ సినిమాలు ఈయన ఖాతాలో ఉన్నాయి. ప్రముఖ భారతీయ నటుడు, నిర్మాత. తమిళ సినీ రంగంలో ఎక్కువగా పనిచేశారు. తన మాతృభాష అయిన తెలుగులోకి ఆయన తమిళ సినిమాలు ఎక్కువగా అనువదించారు. సినీ నిర్మాత జి.కె.రెడ్డి చిన్న కుమారుడు విశాల్. చెన్నైలోని లయోలా కళాశాలలో విజువల్ కమ్యూనికేషన్స్ చదువుకున్నారు. తన స్వంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీతో ఎన్నో సినిమాలను నిర్మించారు విశాల్.తమిళ నటుడు, దర్శకుడు అర్జున్ వద్ద సహాయ దర్శకునిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు విశాల్. ఆ తరువాత 2004లో చెల్లమే అనే సినిమాతో కథానాయుకునిగా తెరంగేట్రం చేసిన ఆయనకు సందకోళి(2005), తిమిరు(2006) సినిమాలతో విజయం అందుకున్నారు. తరువాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. తన స్వంత నిర్మాణ సంస్థను స్థాపించి పాండియ నాయుడు(2013), నాన్ సిగప్పు మనిథన్(2014) వంటి విజయవంతమైన సినిమాలు నిర్మించారు విశాల్.
ఇక విషయానికొస్తే తమిళ నటుడు విశాల్-హైదరాబాద్ అమ్మాయి అనీశాల వివాహం ఆగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 10న వీరికి నిశ్చితార్థమైంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి టర్కీ ట్రిప్ వేసొచ్చారు. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు పొడసూపినట్టు తెలుస్తోంది. దీంతో వివాహం రద్దు చేసుకున్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫొటోలు పోస్టు చేస్తూ యాక్టివ్‌గా ఉండే అనీశా.. ఇటీవల విశాల్‌తో తానున్న ఫొటోలను డిలీట్ చేయడం ఈ అనుమానాలకు మరింత ఊతమిస్తోంది.అయితే, వీరిమధ్య మనస్పర్థలకు కారణం ఏంటన్నది మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న వార్తలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మనస్పర్థల నేపథ్యంలో ఇరు కుటుంబాల పెద్దలు కూడా పెళ్లి విషయంలో వెనకడుగు వేసినట్టు సమాచారం. అయితే, ఈ వార్తలపై అటు విశాల్ కానీ, ఇటు అనీశా కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. అంటే ఈ విషయం నిజమై ఉండచ్చని వార్తలొస్తున్నాయి.

Leave a Response