విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ రూపొందుతోంది. ఆ తరువాత ఆయన సినిమాగా ‘ఫైటర్’ సెట్స్ పైకి వెళ్లనుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా నిర్మాణంలో కరణ్ జొహార్ భాగస్వామి కావడంతో, తెలుగుతో పాటు ఐదు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.అందువలన బాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేయనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ఆ జాబితాలో అలియా భట్ .. సారా అలీఖాన్ .. జాన్వీ కపూర్ పేర్లు ఎక్కువగా వినిపించాయి. జాన్వీ కపూర్ ని ఖరారు చేశారనేది తాజా సమాచారం. అడ్వాన్స్ గా ఆమెకి కోటి రూపాయలు కూడా ఇచ్చారని అంటున్నారు. జాన్వీ కపూర్ ను ఒప్పించడంలో కరణ్ జొహార్ ప్రధానమైన పాత్రను పోషించాడని చెప్పుకుంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు వున్నాయి.
previous article
నా లవర్ ను ప్రేమికుల రోజున మీ ముందుంచుతా రాశి ఖన్నా
next article
విడుదలకి ముస్తాబవుతున్న ‘రూలర్’