వయసు పెరిగినా వన్నె తగ్గని హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ముందువరుసలో ఉంటుంది. ఇప్పటికీ ఆమె ఛరిష్మా ఏమాత్రం తగ్గలేదు. తాజాగా అమ్మడికి అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కాజల్ మైనపు బొమ్మ ప్రతిష్టించనున్నారు. ఈ మేరకు ఈ అందాల అభినేత్రి కొలతలు తీసుకున్నారు. ఇప్పటివరకు దక్షిణాది నుంచి ఏ హీరోయిన్ కు దక్కని భాగ్యం ఇది. మరే సౌతిండియా భామ మేడమ్ టుస్సాడ్స్ లో స్థానం దక్కించుకోలేకపోయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కాజల్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు
previous article
బాలకృష్ణ తదుపరి ప్రాజెక్టులో సోనాక్షి సిన్హా
next article
వెంకీ మామ’ వెండితెర వెలిగిపోయేలా నటించారంటూ కామెంట్