మహేశ్‌బాబు కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’. రష్మిక కథానాయిక. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కశ్మీర్లో జరుగుతోంది. శుక్రవారంతో తొలి షెడ్యూల్ పూర్తయినట్లు దర్శకుడు అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్మీ దుస్తుల్లో మహేశ్ థంబ్సప్ సింబల్ చూపిస్తున్న ఫొటోను పంచుకున్నారు. ‘మహేశ్‌బాబుతో పనిచేయడం అద్భుతంగా ఉంది’ అని తెలిపారు. అంతేకాదు, ఈనెల 26 నుంచి రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నట్లు పేర్కొన్నారు. దీనికోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.కశ్మీర్ షెడ్యూల్లో మహేశ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇందులో మహేశ్ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్నారు. చాలా రోజుల తర్వాత నటి విజయశాంతి తిరిగి ఈ సినిమా కోసం మేకప్ వేసుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబులు సంయుక్తగా నిర్మిస్తున్నారు.
previous article
మన్మథుడు 2’లో ఇంకా యంగ్‌గా ఉన్న నాగ్…..
next article
రకుల్ కాజల్ హీరోయిన్గా….