ర‌కుల్ కాజ‌ల్ హీరోయిన్‌గా….

ఫిట్‌నెస్ ఫ్రీక్‌.. పంజాబీ ముద్దుగుమ్మ ర‌కుల్ ప్రీత్ సింగ్ తెలుగు, త‌మిళ‌, హిందీ చిత్రాల్లో న‌టిస్తూ బిజీ బిజీగా ఉంది. కాగా ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ‌కు ఓ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌లో న‌టించే అవ‌కాశం రానుంది. వివ‌రాల్లోకెళ్తే స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌, క‌మ‌ల్‌హాస‌న్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న చిత్రం `భార‌తీయుడు 2`. సినిమా కొన్ని రోజుల క్రితం ప్రారంభ‌మై, ఆగిపోయిన ఈ చిత్రం ఆగ‌స్ట్‌లో మ‌ళ్లీ ప్రారంభం కానుంది. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం `భారతీయుడు 2`లో కీల‌క పాత్ర‌ధారిగా ర‌కుల్‌ను న‌టింప చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. శంక‌ర్ డైరెక్ట‌ర్ కావ‌డం.. పాత్ర న‌చ్చ‌డంతో ర‌కుల్ `భార‌తీయుడు 2` చేయ‌డానికి ఓకే చెప్పిందట‌. అయితే ర‌కుల్ రెమ్యున‌రేష‌నే నిర్మాత‌ల‌కు షాకిచ్చింది. ఈ అమ్మ‌డు దాదాపు కోటిన్న‌ర రూపాయ‌ల‌ను డిమాండ్ చేస్తుంద‌ట‌. పాత్ర ప‌రిధి చిన్న‌దిగా ఉంటుంది క‌దా! అంత మొత్తంలో చెల్లించాలా? అని నిర్మాత‌లు ఆమెతో బేరసారాలు న‌డుపుతున్నార‌ట‌. 1996లో క‌మ‌ల్ హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `భార‌తీయుడు` సినిమాకు ఇది సీక్వెల్‌. ఇందులో కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

Leave a Response