బోయవాని చిక్కుల్లో ”వాల్మీకి” చిత్రం..?

2014 ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ తేజ్ కానీ ఆ సినిమా అంత అంత మాత్రం గానే ఆడింది. తర్వాత వచ్చిన “కంచె”, ఫిదా , అంతరిక్షం, ఎఫ్ 2 మొదలైనవాటిలో వరుణ్ నటించి ఒక మంచి స్టార్ గా ఎదిగాడు. సినిమాల కోసం ఎంతో కష్టపడ్డాడు. యాక్టింగ్ లో తన టేలెంట్ నిరూపించుకున్నాడు. ఇప్పుడు వరుణ్ తేజ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘వాల్మీకి’ చిత్రం గురించి అందరికి తెలిసిందే ఇందులో వరుణ్ కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. ఎప్పుడు సైలెంట్ గా ఉండే వరుణ్ ఇందులో వైలెంట్ గా కనిపిస్తున్నాడు. అసలు విషయం ఏమిటంటే

వరుణ్ నటిస్తున్న వాల్మీకి చిత్తం చిక్కుల్లో పడింది. ఈ సినిమా టైటిల్ మార్చాలంటూ బోయ హక్కుల సమితి నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘వాల్మీకి’ టైటిల్ బోయలను కించపరిచేలా ఉందని, ఈ చిత్రానికి పేరు మార్చేలా హైకోర్టు చర్యలు తీసుకోవాలని బోయ హక్కుల సమితి నేతలు తమ పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. చిత్ర యూనిట్ ఇప్పటికైనా స్పందించి టైటిల్ మార్చాలని, లేకపోతే తమ పోరాటం కొనసాగుతుందని బోయ హక్కుల నేతలు హెచ్చరించారు. కాగా, ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రేపు ఈ పిటిషన్ విచారణకు రానుంది.

Leave a Response