టాలీవుడ్ రియాల్టీ షో బిగ్‌బాస్‌కు ఇక్కడ మంచి ఆదరణ లభించింది. దక్షిణాది అన్ని భాషల్లో ఈ కార్యక్రమం సక్సెస్ అయింది. తెలుగులో ఇప్పటికే రెండు సీజన్లను కంప్లీట్ చేసుకున్న బిగ్‌బాస్ షో.. మూడో సీజన్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ షోలో పాల్గొనేవారి లిస్ట్ ఇదేనంటూ కొన్ని పేర్లు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ సారి హోస్ట్ విషయంలో బిగ్‌బాస్ బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంది. మొదటి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను, రెండో సీజన్‌కు న్యాచురల్‌స్టార్ నానిని తీసుకోగా.. మూడో సీజన్‌కు చాలా మంది పేర్లను పరిశీలించింది. ఎట్టకేలకు మూడో సీజన్‌కు హోస్ట్ దొరికేశాడు.
మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించి బుల్లితెరపైనా తనకు తిరుగులేదని నిరూపించుకున్న టాలీవుడ్ కింగ్ నాగార్జున.. బిగ్‌బాస్ మూడో సీజన్‌ను నడిపించనున్నాడు. ఇదే విషయాన్ని గత సీజన్లో పాల్గొన్న సామ్రాట్.. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. నాగార్జున హోస్టింగ్‌లో ఈ సీజన్ ఇంకా ఆసక్తికరంగా మారబోతోందని తెలుస్తోంది. అసలే రెండో సీజన్ వేడీ ఇంకా తగ్గలేదు. మొన్నటివరకు దీని గొడవలు చల్లారనే లేదు. మరి ఈ మూడో సీజన్ ఎక్కడికి దారితీస్తుందో.. ఎవరిని ఓవర్‌నైట్ స్టార్‌ను చేస్తుందో చూడాలి. అసలే ఈసారి లిస్ట్‌లో చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. యూట్యూబ్ స్టార్లు, యాంకర్స్, సింగర్స్ ఇలా ప్రతీ క్యాటగిరీ నుంచి సెలబ్రిటీస్‌ను రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది. జూలైలో బిగ్‌బాస్ 3 ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. తమిళ బిగ్‌బాస్ మూడో సీజన్ ఇప్పటికే రెడీ అయింది. కమల్ హాసన్ హోస్ట్‌గా వచ్చే వారంలో మొదలుకానుంది.