ఆరు వికెట్ల తేడాతో భారత్‌ విజయం

సౌథాంప్టన్‌: ఇంగ్లాండ్ క్రికెట్ గ్రౌండ్స్ లో చెలరేగిపోయిన రోహిత్ శర్మ తనదైన శైలిలో తొలి మ్యాచ్‌లోనే (122; 144బంతుల్లో 13×4, 2×6) శతకంతో చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ను ఆదిలోనే శిఖర్ రూపంలో ఒత్తిడి వచ్చిన అటు రోహిత్ ఏమాత్రం నిరాశపడకుండా కోహ్లీ సేన రోహిత్ తో కలసి ధోనీ(34; 46బంతుల్లో 2×4), కేఎల్‌ రాహుల్‌(26;42బంతుల్లో 2×4)తో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పి వరల్డ్‌ కప్‌లో భారత్‌కు తొలి విజయం అందించాడు. రోహిత్‌ ధాటికి టీం ఇండియా 47.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 6వికెట్ల తేడాతో అద్భుత ఘన విజయాన్ని కైవసం చేసుకుంది.

Leave a Response