బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ నటించిన ‘దబాంగ్’కు సీక్వెల్‌గా వచ్చిన ‘దబాంగ్ 3’పై హిందూ జాగృతి సమితి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమాలోని ఓ పాట, కొన్ని సన్నివేశాలు సాధువులను కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సెన్సార్ బోర్డుతోపాటు మహారాష్ట్ర సర్కారుకు విజ్ఞప్తి చేసింది.ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల హిందూ జాగృతి సమితి కోఆర్డినేటర్ సునీల్ ఘన్వాట్ ఈ డిమాండ్ చేశారు. సాధువులను కించపరిచేలా ఉన్న సన్నివేశాలను వెంటనే తొలగించాలని, లేకుంటే తమ కార్యకర్తలు సినిమా థియేటర్ల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తారని హెచ్చరించారు. సినిమాలోని అభ్యంతరకర సీన్లపై మహారాష్ట్ర హోంశాఖ కల్పించుకోవాలని డిమాండ్ చేశారు.