తెలుగులోని స్టార్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ ఒకరు. అన్ని తరగతుల ప్రేక్షకులను అలరించే విధంగా త్రివిక్రమ్ కథలను తయారు చేసుకుంటాడు. ఏదైనా పాత సినిమా నుంచి స్ఫూర్తిని పొందినా, ఆ కథపై తన ముద్ర వుండేలా చూసుకుంటాడు. ఇక త్రివిక్రమ్ సినిమాలకి ఆయన సంభాషణలే బలం. అలాంటి త్రివిక్రమ్ .. పెద్ద గ్యాప్ లేకుండా పవన్ .. మహేశ్ .. అల్లు అర్జున్ లతో ఎక్కువ సినిమాలు చేశాడు.ఇక ఇప్పుడు తన తదుపరి సినిమాను ఆయన ఎన్టీఆర్ తో చేయనున్నట్టు సమాచారం. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ చేసిన ఎన్టీఆర్, ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత మళ్లీ త్రివిక్రమ్ తోనే చేయాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఉన్నట్టుగా చెబుతున్నారు. ఈ విషయంపై ఇద్దరి మధ్య చర్చలు జరిగాయని అంటున్నారు. త్రివిక్రమ్ తో సినిమా అంటే దాదాపు హిట్ కేటగిరీకి చేరువలో వున్నట్టుగా భావించడం వల్లనే ఆయనతో ప్రాజెక్టును ఎన్టీఆర్ సెట్ చేసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది.
- /
- /admin
- /No Comment
- /11 views
త్రివిక్రమ్ వైపు మొగ్గు చూపిన ఎన్టీఆర్ త్వరలో ఇద్దరి కాంబినేషన్లో రెండో సినిమా
previous article
ప్రతిరోజూ పండగే ప్రమోషన్స్ లో టికెట్లు అమ్ముతూ రాశీ ఖన్నా
next article
దబాంగ్ 3’పై హిందూ జాగృతి సమితి ఆందోళన..