టాలీవుడ్ యాంగ్ హీరో మహేశ్‌బాబు మహర్షి సినిమా తరువాత కుటుంబంతో ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది. ‘‘మహర్షి’ సెలబ్రేషన్స్’లో భాగంగా మహేశ్ తన సతీమణి నమ్రత, పిల్లలు గౌతమ్, సితారతో కలిసి ఇటీవల జర్మనీ వెళ్లారు. అక్కడే దాదాపు వారం రోజులపాటు ఉన్న మిల్క్ బాయ్ ఫ్యామిలీ బుధవారం ఇటలీకి బయలుదేరారు. ఈ సందర్భంగా జర్మనీలో దిగిన ఫొటోను మహేశ్ పోస్ట్ చేశారు.
‘జర్మనీలో సమయం అద్భుతంగా గడిచింది. ఇప్పుడు ఇటలీకి బయలుదేరాం’ అంటూ ‘సెలబ్రేటింగ్ మహర్షి’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.అదేవిధంగా బుధవారం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మహేశ్ అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. ‘హ్యాపీ ఈద్.. ఆ భగవంతుడు ప్రేమ, శాంతి, విజయంతో మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’ అంటూ సెల్ఫీని పోస్ట్ చేశారు.
మరోవైపు ‘మహర్షి’ సినిమా రూ.200 కోట్ల వైపు పరుగులు పెడుతోంది. సినిమా మంచి టాక్ అందుకోవడంతోపాటు బాక్సాఫీసు వద్ద కూడా ఘన విజయం సాధించడం పట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది.