అక్కినేని కోడలి గొప్పతనం…

టాలీవుడ్ లో అందం, అభినయం, మంచితనం..కలిసి ఉన్న నటి అక్కినేని సమంత. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా సినిమా పరిశ్రమకు వచ్చి తన శ్రమతో నేడు అగ్ర హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. కథానాయికగా హీరోల పక్కన ఇలా మెరిసి, అలా వెళ్లిపోకుండా ప్రాధాన్యం ఉన్న పాత్రల్ని ఎంచుకుంటూ అందర్నీ మెప్పిస్తున్నారు. అంతేకాదు అనారోగ్యంతో బాధపడుతున్న వందల మంది చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారు. తన గొప్ప వ్యక్తిత్వంతో అక్కినేని వారసుడు నాగచైతన్య మనసు దోచి ఆ ఇంటి కోడలయ్యారు.

అందుకే ఆమంటే అభిమానులకు అంత ఇష్టం. సోషల్‌మీడియాలో సామ్‌కు ఉన్న క్రేజే వేరు. ఆమె సామాజిక మాధ్యమాల్లో చాలా చురుకుగా ఉంటుంటారు. అభిమానులతో తన మనసులోని మాటల్ని చెబుతూ ఉంటారు. గత కొన్నేళ్లుగా ఆమె అభిమానులతో పంచుకున్న కొన్ని విశేషాలను చూద్దాం.అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులు, మహిళలకు వైద్య సేవలు అందించేందుకు సమంత 2012లో ప్రత్యూష ఫౌండేషన్‌ను స్థాపించారు. పలు ఉత్పత్తులకు ప్రచారకర్తగా వచ్చే పారితోషికాన్ని, ప్రారంభోత్సవాల ద్వారా వచ్చే మొత్తాన్ని ఆమె ఈ సంస్థకు విరాళంగా ఇస్తున్నారు. ఇలా ఇప్పటికి ఆమె వందల మందికి చికిత్స చేయించారు. ఫౌండేషన్‌కు చెందిన చిన్నారులతో కలిసి దిగిన ఫొటోలను కూడా ఆమె పలు సందర్భాల్లో అభిమానులతో షేర్‌ చేసుకున్నారు.సామ్‌ ఫిట్‌నెస్‌కు చాలా ప్రాముఖ్యం ఇస్తుంటారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటారు.

పలు సందర్భాల్లో ఫిట్‌నెస్‌ వీడియోలను షేర్‌ చేశారు. ఇటీవల 100 కిలోలు లిఫ్ట్‌ చేసి నెటిజన్లతో శభాష్‌ అనిపించుకున్నారు.అజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం స్పెషల్. వాస్తవ్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. రంగ, అక్షత జంటగా నటిస్తున్నారు. ఈ నెల 14న విడుదలకానుంది. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకనిర్మాత వాస్తవ్ మాట్లాడుతూ ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ప్రేమ పేరుతో తనను మోసం చేసిన యువతితో పాటు అందుకు కారణమైన వారిపై ఓ మైండ్ రీడర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నది ఆసక్తిని కలిగిస్తుంది.క్రౌడ్ ఫండింగ్ విధానంలో స్నేహితులందరం కలిసి ఈ సినిమాను నిర్మించాం. తక్కువ బడ్జెట్‌లో మంచి సినిమా చేయోచ్చని నిరూపించిన చిత్రమిదని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. పోలీస్ అధికారిగా అజయ్ పాత్ర సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది అని తెలిపారు. ఈ సినిమాలో తాను సైకియాట్రిస్ట్ పాత్రలో నటించానని, సమాజాన్ని ప్రభావితం చేసే మంచి సినిమా ఇదని నటుడు అశోక్‌కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జబర్దస్థ్ అప్పారావు, అమర్ తదితరులు పాల్గొన్నారు.

.

Leave a Response